పుట్టిన రోజు వేళ దర్శకధీరుడు రాజమౌళి గురించి కొన్ని విషయాలు..

10 October 2023

10 అక్టోబర్ 1973లో కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో హిరేకోటికల్ గ్రామంలో జన్మించారు దర్శకదీరుడు ఎస్ ఎస్ రాజమౌళి.

ఆయన పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. పేరులో ఉన్న ఎస్ ఎస్ అంటే శ్రీశైల శ్రీ. కోడూరి అయన ఇంటిపేరు.

రాజమౌళి డైరెక్షన్ స్కిల్స్ కి ఆధారంగా ఆయనను జక్కన్న, రాజా, నంది అనే మూడు పేర్లతో కూడా ప్రేమగా పిలుస్తారు.

2001లో కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళిని వివాహం చేసుకున్నారు రాజమౌళి. ప్రస్తుతం అయన సినిమాల కాస్ట్యూమ్ పనులన్నీ ఆమె చేసుకుంటున్నారు.

2001లో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకునిగా పరిచయం అయ్యారు జక్కన్న. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

తర్వాత సింహాద్రి, సై, ఛత్రపతి, ట్రిపుల్ ఆర్ వరుసగా అన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలే.. ఒక ప్లాప్ కూడా లేదు.

ఈగ సినిమా వరకు ఒకటి.. బాహుబలితో కథ మొత్తం మారిపోయింది. ఈ మూవీతో తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన ఘనత అయన సొంతం.

ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలబెట్టారు. తెలుగు సినిమాకు మకుటంలేని మహారాజు రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు.