సదా జడ్జిగా చేసిన టీవీ షోస్ ఇవే..
23 October 2023
మొదటిగా ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ'లో 'ఢీ జూనియర్స్ 1'లో జడ్జిగా చేశారు హీరోయిన్ సదా. ఈ షోలో తరుణ్ మాస్టర్, శేఖర్ మాస్టర్ మరో ఇద్దరు జడ్జ్‌లు.
తర్వాత ఢీ జూనియర్స్ 2 కూడా తరుణ్ మాస్టర్, శేఖర్ మాస్టర్ తోపాటు ఈమెనే జడ్జిగా ఉన్నారు. మెగా ప్రిన్స్ నిహారిక కొణిదల ఈ షో హోస్ట్.
తర్వాత ఢీ సిరీస్ లో ఢీ జోడి స్పెషల్ షోకి కూడా సదానే జడ్జి. ఇందులో శేఖర్ మాస్టర్ కూడా ఓ జడ్జి. ప్రదీప్ మాచిరాజు హోస్ట్.
2016లో తమిళ సక్సెస్‌ఫుల్ డ్యాన్స్ షో జోడి నంబర్ వన్ సీజన్ 9కి జడ్జిగా వ్యహరించారు కథానాయకి సదా.
తరవాత 2022లో ప్రముఖ టెలివిజన్ ఛానల్ లో ప్రసారమైన BB జోడి తెలుగు అనే డ్యాన్స్ షోకి కూడా ఈమె జడ్జిగా చేశారు.
2023లో నీతోనే డ్యాన్స్ అనే ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో జడ్జిగా చేశారు టాలీవుడ్ హీరోయిన్ సదా. ఈ షోకి శ్రీముఖి హోస్ట్.
హలో వరల్డ్ అనే జీ5 వెబ్ సిరీస్ తో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పై అడుపెట్టారు ఆమె. ఇందులో ప్రార్ధన అనే పాత్రలో ఆకట్టుకున్నారు.
ఇటీవల వచ్చిన అహింస చిత్రంలో కీలక పాత్రలో కనిపించరు. అహింస సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి