10 July 2025

గ్లామర్‏తో కవ్విస్తోన్న సీరియల్ బ్యూటీ.. కుర్రాళ్ల మతిపోయేనే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

సీరియల్ ప్రియులకు పరిచయం అవసరంలేని బ్యూటీ. అందంలో అప్సరస.. అయినప్పటికీ విలన్ పాత్రలతోనే క్రేజ్ సంపాదించుకుంది. 

బుల్లితెరపై ఆమె అందమైన విలన్.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. తాజాగా క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది ఈ భామ. 

ఆమె మరెవరో కాదండి.. కార్తీక దీపం మోనిత అలియాస్ శోభా శెట్టి. ఇందులో పవర్ ఫుల్ విలన్ పాత్రలో అద్భుతమైన నటనతో అదరగొట్టేసింది. 

ఈ సీరియల్ ద్వారా బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టి విపరీతమైన నెగిటివిటీని సొంతం చేసుకుంది. ప్రస్తుతం నెట్టింట క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది.

తాజాగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ  చేస్తుంది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

చీరకట్టులో మోనితా షేర్ చేసే ఫోటోస్ కుర్రకారును కట్టిపడేస్తున్నాయి. ఈ అమ్మడు చేసే ఫోటోషూట్లకు నెట్టింట విపరీతమైన క్రేజ్ ఉంటుంది. 

శోభా శెట్టి నటనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందం, అభినయంతో బుల్లితెరపై ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

కానీ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఆమె తన ఆట తీరు, ప్రవర్తనతో మరింత నెగిటివిటీని మూటగట్టుంది. ఇప్పుడు ఒక్క సీరియల్ చేయలేదు.