03 September 2025

అబ్బబ్బో.. మేడమ్ అదరగొట్టింది.. రుద్రాణి అత్త అరాచకం అంతే..

Rajitha Chanti

Pic credit - Instagram

బుల్లితెరపై సీరియల్ విలన్స్ కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో గ్లామర్ బ్యూటీస్ తమ నటనతో ఇరగదీస్తుంటారు. 

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రుద్రాణి అత్త సైతం బుల్లితెరపై లేడీ విలన్ గా అదరగొట్టేస్తుంది. ఇటు హాట్ ఫోటోలతో నెట్టింట గత్తరలేపుతుంది. 

ఇంతకీ రుద్రాణి అంటే గుర్తుపట్టారా.. ? అదేనండి.. బ్రహ్మాముడి ఫేమ్ రుద్రాణి అత్త.. అలియాస్ షర్మిత గౌడ. కర్ణాటకు చెందిన ఈ  బ్యూటికి క్రేజ్ ఉంది. 

బ్రహ్మముడి సీరియల్లో రుద్రాణి పాత్రలో తన సహజ నటనతో కట్టిపడేస్తుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రలో ఈ భామ ఎంతో చక్కగా ఒదిగిపోయారు. 

అంతకు ముందు కన్నడలో పలు సీరియల్స్ చేసింది. అమ్మ, అత్త పాత్రలలో నటించి మెప్పించింది. ఇప్పుడు నెట్టింట ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది. 

నిజానికి అందంలో ఈ బ్యూటీ ముందు హీరోయిన్స్ దిగదుడుపే అన్నట్లుగా కనిపిస్తుంది. నిత్యం మోడ్రన్ లుక్స్ లో గ్లామర్ ఫోటోలతో మెస్మరైజ్ చేస్తుంది.

తాజాగా గ్రీన్ కలర్ మోడ్రన్ లుక్స్ లో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ బ్యూటీ పిక్స్ చూసి ఫిదా అవుతున్నారు జనాలు. 

ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 32 సంవత్సరాలు మాత్రమే. కానీ సీరియల్స్ లో తనకంటే పెద్దవారికి అత్తగా, అమ్మ, వదిన పాత్రలలో కనిపిస్తుంది.