29 January 2025
ఒక్క ఎపిసోడ్ కోసం రూ.18 లక్షలు తీసుకుంటున్న హీరోయిన్.. వయసు 23 ఏళ్లే
Rajitha Chanti
Pic credit - Instagram
భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే బుల్లితెర హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆమె ఒక్క ఎపిసోడ్ రూ. 18 లక్షలు తీసుకుంటుంది.
ఆమె ఆస్తులు ఏకంగా రూ.250 కోట్లు ఉన్నాయట. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ జన్నత్ జుబైర్. ఆమె వయసు కేవలం 23 ఏళ్లే.
కేవలం 21 ఏళ్ల వయసులోనే జన్నత్ జుబైర్ ముంబైలో సొంతంగా ఒక ఇల్లు కొనుగోలు చేసింది. ఇప్పటికే భారీగా ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
ఆమె చాలా మంది అగ్ర సినీతారల కంటే ధనికురాలిగా క్రేజ్ సంపాదించుకున్నారు. అంతేకాదు. టెలివిజన్ పరిశ్రమలో అత్యధిక సంపాదన కలిగిన నటి.
ఆమెకు ఇన్ స్టాలో 49.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. 29 ఆగస్ట్ 2001న ముంబైలో జన్మించిన జన్నత్ బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించింది.
ఇప్పుడు సినీ, టీవీ రంగాల్లో పెద్ద స్టార్ అయ్యింది. దిల్ మిల్ గయే, కాశీ : అబ్ నా రహే తేరా కాకా, పుల్వా, మహారాణా వంటి చిత్రాల్లో నటించింది.
అలాగే హిందీలో అనేక సీరియల్స్ చేసింది. ఇవే కాకుండా యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, ప్రైవేట్ సాంగ్స్ చేసింది. పలు రియాల్టీ షోలలో పాల్గొంది.
ఖత్రోన్ కే ఖిలాడి షోలో ఒక్క ఎపిసోడ్ కోసం జన్నత్ జుబైర్ రూ.18 లక్షల పారితోషికం తీసుకుందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్