మమ్ముట్టి నిర్మాణంలోనే ఆ సినిమా..
TV9 Telugu
18 April 2024
సీనియర్ నటుడు మమ్ముట్టి హీరోగా వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న మలయాళీ మాస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా టర్బో.
ఇది పోక్కిరి రాజా, మధుర రాజా వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మమ్ముట్టి, వైశాఖ్‌ల కలయికలో వస్తున్న మూడవ సినిమా.
సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి సొంత ప్రొడక్షన్ కంపెనీ అయినా మమ్ముట్టి కంపెనీ పతాకంపై ఈ మూవీ రూపొందుతోంది.
ఇందులో టర్బో జోస్ అనే కేరక్టర్‌లో నటించారు మమ్ముట్టి. షూటింగ్ దాదాపుగా పూర్తయిందని తెలిపారు మేకర్స్.
ప్రముఖ కన్నడ నటుడు రాజ్ బి శెట్టి 'టర్బో' చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారని చిత్రవర్గాల సమాచారం.
టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ స్థార్ హాస్యనటుడు సునీల్ ఈ సినిమాతో మలయాళ చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు.
ఈ చిత్రానికి మిధున్ మాన్యువల్ థామస్ కథ రచయిత. జస్టిన్ వర్గీస్ ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి సంగీతం అందించారు.
ఈ సినిమాను జూన్ 13న విడుదల చేయనున్నారు. మేకర్స్ మొదట్లో ఏప్రిల్ లో విడుదల చేయాలనుకున్న అది కుదరలేదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి