బ్రో సినిమాకు త్రివిక్రమ్ తీసుకున్న రెమ్యునరేషన్  ఎంతంటే ??

ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయిధ‌ర‌మ్ తేజ్ కాంబోలో వస్తున్న మెగా మల్టీ స్టారర్ మూవీ ‘బ్రో’.

దర్శక నటుడు సముద్రఖని ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, హాట్ బ్యూటీ కేతికాశర్మ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 28న విడుదల కానుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన హాట్ న్యూస్ వైరల్ అవుతోంది.

అగ్ర దర్శకుడిగా పేరొందిన త్రివిక్రమ్ రెమ్యునరేషన్ గురించి వార్త హల్ చల్ చేస్తోంది.

 స్క్రీన్ ప్లే మాత్రమే కాకుండా మాటలు కూడా ఇస్తూ.. స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేసాడు త్రివిక్రమ్.

అందుకే ఈ సినిమా కోసం రూ. 15 కోట్ల రెమ్యూనరేషన్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.