బ్రో సినిమాకు త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే
‘బ్రో’సినిమా రెండేళ్ల క్రితం తమిళంలో హిట్ అయిన `వినోదయ సీతం`కు తెలుగు రీమేక్.
ఈ చిత్రాన్ని పవన్‌తో సెట్ చేసింది అతని ‘గురువు’ త్రివిక్రమ్.
‘వినోదయ సీతం’ కథంతా మార్చేసి కమర్షియల్ టచ్ ఇచ్చి ఈ చిత్రాన్ని రూపొందించారు.
దీనికి సముద్రఖని దర్శకత్వం వహించినా.. మిగతావన్నీ త్రివిక్రమే చూసుకున్నాడు.
ఇందుకుగాను రూ.15 కోట్లతో పాటు లాభాల్లో పావలా వాటాను రెమ్యునరేషన్‌గా త్రివిక్రమ్ తీసుకున్నారని టాలీవుడ్ టాక్.
కేవలం స్క్రీన్‌ప్లే, మాటల కోసం ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం ఇదే తొలిసారి.
అయితే నిన్నటి ట్రైలర్‌లో మాత్రం త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కనిపించలేదు.
ట్రైలర్‌లోనే అలాంటి డైలాగ్స్ లేవంటే.. సినిమాలో కూడా లేనట్టే అంటూ ఫ్యాన్స్ పరేషాన్ అవుతున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి