త్రివిక్రమ్ తర్వాతి సినిమాపై సస్పెన్స్..  థగ్ లైఫ్ క్రేజీ అప్డేట్..

TV9 Telugu

01 February  2024

సంక్రాంతి విడుదలైన గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ తర్వాతి సినిమాపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఓ సినిమా అనౌన్స్ చేసినా.. అనివార్య కారణాలతో అది ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది.

.అందుకే పవన్ కళ్యాణ్‌తో సినిమాకు గురూజీ సిద్ధమవుతున్నారనే విషయం సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.

అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్‌తో త్రివిక్రమ్ సినిమా చేయలేదు. రైటర్‌గా మాత్రం భీమ్లా నాయక్‌కు పని చేసారు.

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో నాయకుడు సినిమా తెరకెక్కిన 37 ఏళ్ళ తర్వాత వస్తున్న సినిమా థగ్ లైఫ్.

ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా శంకర్ దర్శకత్వంలో కమల్ చేస్తున్న ఇండియన్ 2 కారణంగా నెమ్మదిగా జరుగుతుంది.

తాజాగా థగ్ లైఫ్ సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. తాజాగా చెన్నైలో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టారు.

ఈ సినిమాలో కమల్ హాసన్, త్రిషతో పాటు దుల్కర్ సల్మాన్, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్ కూడా నటిస్తున్నారు.