మరోసారి మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష.. హిట్ కాంబో రిపీట్ ?..
Pic credit - Instagram
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌తో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతుంది హీరోయిన్ త్రిష. పొన్నియన్ సెల్వన్ తర్వాత ఈ ముద్దుగుమ్మ ఫాలోయింగ్ ఒక్కసారిగా మారిపోయింది.
దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఏలేస్తుంది త్రిష. ఇటీవలే లియో సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది ఈ అందాల తార.
ఇక ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తోన్న కొత్త ప్రాజెక్టులో నటిస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు త్రిషకు మరో ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి సరసన మరోసారి త్రిష జోడి కట్టనుందనే వార్తలు ఇటీవల చక్కర్లు వినిపిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి జోడిగా మరోసారి త్రిష నటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో స్టాలిన్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు ఈ సినిమా కోసం చాలా మంది హీరోయిన్లను అనుకున్నారట. బాలీవుడ్ హీరోయిన్స్ నుంచి అనుష్క వరకు చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్ త్రిష.
ఇప్పుడు తెలుగులో చిరంజీవి సినిమానే కాకుండా మరిన్ని అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తెలుగులో కాజల్, త్రిష, నయనతార సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నారు.