వర్షం సినిమాలో ఫస్ట్ అనుకున్న హీరోయిన్ త్రిష కాదట

TV9 Telugu

22 April 2024

త్రిష గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.. ‘నీమనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయ్యింది. 

కొన్నాళ్లు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రాణించింది ఈ చెన్నై అందం. అంతేకాదు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలి

అయితే తరువాత ఉన్నట్టుండి కనుమరుగైన త్రిష.. పోన్నియన్ సెల్వన్ సినిమాలో నటించే త్రిష మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది.

ఆ తర్వాత ఈమెకు తమిళ సినీ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు రాగా తాజాగా  హీరో విజయ్ నటించిన లియోలో కీలకపాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే.

అది అలా ఉంటే.. త్రిష్ తన కెరీర్ మొదట్లో శోభన్ దర్శకత్వం లో వచ్చిన ప్రభాస్ సరసన వర్షం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

వర్షం సినిమాలో ప్రభాస్ సరసన త్రిష నటించగా.. వారిద్దరి కెమిస్ట్రీ సినిమాలో పెద్ద హైలైట్ గా నిలిచింది.

అయితే అసలు ఈ సినిమాకి మొదట ప్రభాస్ సరసన హీరోయిన్‌గా త్రిష ప్లేస్‌లె యంగ్ హీరోయిన్ అదితి అగర్వాల్‌ని అనుకున్నారట.

అప్పటికే “గంగోత్రి” సినిమాతో మంచి ఫామ్‌లో ఉన్న అదితి అగర్వాల్‌ హీరోయిన్‌గా చేయాల్సిందట.. ఏవో కారణాల వల్ల ఆమె స్థానంలో త్రిష వచ్చి చేరింది..