బాలీవుడ్ లో సత్తా చాటడానికి రెడీ అయిన అందాల త్రిష 

rajeev 

26 AUG 2024

నాలుగు పదుల వయసు దాటినా కూడా గ్లామర్ తో ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ లో త్రిష, నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

తెలుగులో ఈ బ్యూటీకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో త్రిష దాదాపు అందరు హీరోల సరసన నటించి మెప్పించింది.

చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ సరసన త్రిష. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతో కూడా నటించి మెప్పించింది.

ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. అంతే కాదు ఈ సినిమాలో నటించిన ఐశ్వర్య రాయ్‌తో అందం విషయంలో పోటీ పడింది.

ఇక ఇప్పుడు త్రిష బాలీవుడ్ లోకి అడుగు పెడుతుందని వార్తలు జోరుగా వినిపిస్తుంది. ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. 

2014లో విడుదలైన కామెడీ చిత్రం ‘కట్టా-మీటా’లో త్రిష జిల్లా కలెక్టర్‌గా నటించింది. ఆతర్వాత మరో హిందీ సినిమాలో నటించలేదు.

సల్మాన్ ఖాన్ కొత్త సినిమాలో త్రిష నటించనుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా రశ్మికతో పాటు త్రిష కూడా ఉంటుందని అంటున్నారు.