12 August 2025

42 ఏళ్ల వయసులో ఈ అరాచకమేందీ మేడమ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా.. ?

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్లలో ఒకరు. రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది ఈ హీరోయిన్. 

ప్రస్తుతం ఆమె వయసు 42 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందం.. చేతినిండా సినిమాలతో హీరోయిన్లుకే గుబులు పుట్టిస్తోంది. 

తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది. అటు సీనియర్ హీరోలతో జతకడుతూ వరుస హిట్లు అందుకుంటుంది. 

ఆమె మరెవరో కాదండి హీరోయిన్ త్రిష. కొన్నేళ్లుగా సినిమా ప్రపంచంలో వరుస సినిమాలతో అందం, అభినయంతో తనదైన ముద్ర వేసింది ఈ ముద్దుగుమ్మ. 

కొన్నాళ్ల క్రితం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఇటీవలే విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. 

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అలాగే తమిళంలో పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది ఈ వయ్యారి. 

ఇప్పటికే ఫిట్నెస్, అందంలో స్టార్ హీరోయిన్లకు షాకిస్తున్న ఈ అమ్మడు.. మరోవైపు రెమ్యునరేషన్ విషయంలోనూ ఏమాత్రం తక్కువ కాదంటుంది. 

త్రిష ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. పారితోషికం విషయంలో కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదంటుంది.