09 July 2025

అప్పడు నా కాలేజ్ ఫ్రెండ్.. ఇప్పుడు నా ఫేవరేట్ హీరో.. త్రిష

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోని కుర్ర హీరోయిన్లను చెమటలు పట్టిస్తోంది త్రిష. 42 ఏళ్ల వయసులో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. 

ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఇక ఇప్పుడు చిరంజీవి జోడిగా విశ్వంభరలో నటిస్తుంది. 

తెలుగు, తమిళం భాషలలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంది. తాజాగా ఓ హీరో గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరో తన కాలేజ్ ఫ్రెండ్ అని.. ఆ సమయంలో ఇద్దరికీ పరిచయం ఉందని చెప్పుకొచ్చింది. 

కానీ ఇప్పుడు అతడు సూపర్ స్టార్ అయ్యారని.. అంతేకాకుండా తనకు ఇష్టమైన హీరో సైతం అతడే అని తెలిపింది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..

అతడు మరెవరో కాదండి.. సూపర్ స్టార్ మహేష్ బాబు. అవును.. మహేష్ బాబు, తాను చెన్నైలో కాలేజ్ ఫ్రెండ్స్ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

ఆ సమయంలో ఇద్దరం యాక్టర్స్ అవుతామని అసలు ఉహించలేదని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తనకు ఇష్టమైన హీరోలలో మహేష్ ఒకరట. 

ఇదిలా ఉంటే.. త్రిష, మహేష్ బాబు కలిసి పలు చిత్రాల్లో నటించారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, సైనికుడు సినిమాలు హిట్టయ్యాయి.