30 March 2024
నయనతారను వెనక్కు నెట్టిన త్రిష.. వామ్మో.. స్పీడ్ తగ్గట్లేదుగా..
Rajitha Chanti
Pic credit - Instagram
దాదాపు 20 సంవత్సరాలుగా సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తుంది హీరోయిన్ త్రిష. రెండు దశాబ్దాలుగా టాప్ హీరోయిన్గా సినీ పరిశ్రమలో దూసుకుపోతుంది.
సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరి జోడిగా నటించి అలరించింది త్రిష. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
పొన్నియన్ సెల్వన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన త్రిష.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ తెలుగు, తమిళంలో దూసుకుపోతుంది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి జోడిగా విశ్వంభర సినిమాలో నటిస్తుంది. అలాగే కమల్ హాసన్ నటిస్తున్న థగ్ లైఫ్ సినిమాలోనూ కీలకపాత్ర పోషిస్తుంది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఉన్న నయనతారను త్రిష వెనక్కి నెట్టిసిందని టాక్ వినిపిస్తుంది. అసలు విషయానికి వస్తే..
ఇటీవల లియో సినిమాలో నటించినందుకు దాదాపు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందట. ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాకు రూ.12 కోట్ల పారితోషికం తీసుకుంటుందట.
ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కోలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుని నయన్ను వెనక్కి నెట్టిందట.
ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న కథానాయికగా త్రిష పేరు మారుమోగుతుంది. అయితే ఈ రూమర్స్ పై త్రిష స్పందించలేదు.
ఇక్కడ క్లిక్ చేయండి.