09 October 2025

మళ్లీ మొదలు.. 42 ఏళ్ల వయసులో హీరోయిన్ పెళ్లిగోల.. రూమర్స్ హల్చల్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

సాధారణంగా హీరోయిన్లకు సంబంధించిన పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి. ముఖ్యంగా పెళ్లి రూమర్స్ చెప్పక్కర్లేదు. 

తాజాగా  హీరోయిన్ త్రిష పెళ్లి న్యూస్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. 42 ఏళ్ల వయసులో ఈ బ్యూటీ వివాహం చేసుకోనుందనే టాక్ వినిపిస్తుంది. 

త్వరలోనే ఈ బ్యూటీ ఇంట పెళ్లి భాజాకు సమయం ఆసన్నమైందని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. 

గతంలో చాలాసార్లు త్రిష పెళ్లి గురించి వార్తలు వినిపించాయి. అయితే తన వివాహం గురించి వస్తున్న వార్తలు అసత్యమంటూ ఇదివరకే ఖండించింది.

ఇప్పుడు మరోసారి త్రిష పెళ్లి గురించి టాక్ నడుస్తోంది. మరోవైపు ఈ బ్యూటీ మాత్రం దక్షిణాదిలో వరుస సినిమాల్లో నటిస్తూ తెగ బిజీగా ఉంటుంది. 

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. 

మరోవైపు తమిళంలో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. 

సోషల్ మీడియాలో నిత్యం ఏదోక పోస్ట్ చూస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు తెగ వైరలవుతున్నాయి.