మరోసారి ఆ స్టార్ హీరో సినిమాలో త్రిష.. కానీ హీరోయిన్గా కాదు..
Rajitha Chanti
Pic credit - Instagram
సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకుపోతుంది హీరోయిన్ త్రిష. గతేడాది విజయ్ దళపతి సరసన లియో సినిమాలో కనిపించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.
దీంతో మరోసారి ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తమిళంలో అజిత్ సరసన విడుదల చిత్రంలో నటిస్తుంది త్రిష.
అలాగే మెగాస్టార్ చిరంజీవి జోడిగా విశ్వంభర మూవీలో నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ సెట్ లో జాయిన్ అయ్యింది. గతంలో వీరిద్దరి కాంబోలో స్టాలీన్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు త్రిష మరో రిస్క్ చేస్తుందట. ప్రస్తుతం కథానాయికగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఓ హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేస్తుందట.
విజయ్ దళపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (ది గోట్). ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో త్రిష ఓ స్పెషల్ రోల్ చేస్తుందట. చిన్న అతిథి పాత్రలో ఈ బ్యూటీ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇంకా క్లారిటీ రాలేదు.
దీంతో సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలతో దూసుకెళ్తున్న ఈ బ్యూటీ ఈ సమయంలో గెస్ట్ రోల్స్ ఏంటీ ? అంటున్నారు. త్రిషకు ఇటు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి.
అలాగే తమిళంలో కమల్ హాసన్ నటిస్తోన్న థగ్ లైఫ్ చిత్రంలోనూ నటిస్తుంది త్రిష. ఇలా అటు తమిళ్, ఇటు తెలుగులో మళ్లీ వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది త్రిష.