అందం ఈమె సొత్తేమో.. వదిలి పోనంటుంది..
10 December 2023
4 మే 1983న తమిళనాడు రాజధాని చెన్నైలో పాలక్కాడ్ అయ్యర్ కుటుంబంలో జన్మించింది అందాల తార త్రిష కృష్ణన్.
ఈ వయ్యారి తండ్రి పేరు కృష్ణన్ అయ్యర్ మరియు తల్లి పేరు ఉమా అయ్యర్. వీరిద్దరికి ఈ ముద్దుగుమ్మ ఏకైక సంతానం.
చెన్నైలోని చర్చ్ పార్క్‌లో సేక్రేడ్ హార్ట్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది.
తర్వాత చెన్నైలోని ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA) కోర్సు చేసింది.
మోడలింగ్‌లో తన కెరీర్ ప్రారంభించింది. అనేక ప్రింట్, టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో నటించింది ఈ ముద్దుగుమ్మ.
1999లో "మిస్ సేలం" అందాల పోటీలో కిరీటాన్ని కైవసం చేసుకుంది. అదే సంవత్సరం మిస్ చెన్నై పోటీలో పాల్గునది.
2001లో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీల్లో "బ్యూటిఫుల్ స్మైల్" అవార్డును కూడా గెలుచుకుంది ఈ వయ్యారి భామ.
2003లో నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై వర్షం, అతడు, పౌర్ణమి, స్టాలిన్ లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో కథానాయకిగా కనిపించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి