ఆ క్రేజీ స్టార్ హీరోతో మరోసారి జతకట్టనున్న త్రిష..
16 September 2023
20 ఏళ్లుగా వెండితెర మీద స్టార్ ఇమేజ్ కంటిన్యూ చేస్తున్న బ్యూటీ త్రిష కృష్ణన్. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితోనూ జోడి కట్టిన ఈ బ్యూటీ ఆ మధ్య కెరీర్‌లో స్లో అయ్యారు.
ఇక త్రిష కెరీర్ ముగిసినట్టే అనుకుంటున్న టైమ్‌లో 96 సినిమాతో మరోసారి బౌన్స్ బ్యాక్ అయిన ఈ బ్యూటీ... ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు.
లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా ఉన్న త్రిష... రీసెంట్‌గా పొన్నియిన్ సెల్వన్‌తో మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.
ఈ సినిమా విషయంలో ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ప్రమోషన్స్‌లోనూ త్రిష గ్లామర్ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. అందుకే ఇప్పుడు ఈ బ్యూటీతో జోడికి స్టార్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు.
ప్రజెంట్ విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లియో సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు త్రిష. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో స్టార్ హీరో కూడా ఈ బ్యూటీతో జోడికి రెడీ అవుతున్నారు.
రీసెంట్‌గా విక్రమ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన కమల్ హాసన్ తన నెక్ట్స్ సినిమాకు హీరోయిన్‌గా త్రిషను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు.
గతంలో కమల్‌తో కలిసి చీకటి రాజ్యం, మన్మథ బాణం సినిమాల్లో నటించారు త్రిష, ఇప్పుడు మరోసారి ఇదే కాంబినేషన్‌లో రిపీట్ అవుతుండటంతో ఆసక్తికరంగా మారింది.
దీనికి తోడు కమల్, త్రిష కృష్ణన్ ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉండటం కూడా కలిసొస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్.