19 March 2024
అల్లు అర్జున్ సరసన త్రిప్తికి ఛాన్స్.. ఇది క్రేజీ కాంబోనే..
Rajitha Chanti
Pic credit - Instagram
యానిమల్ సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. ఈ మూవీతో ఈ అమ్మాడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.
ఇక ఈ ముద్దుగుమ్మకు తెలుగు, హిందీ భాషలలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు చిత్రాల్లో చాన్స్ కొట్టేసింది.
ఇప్పుడు మరో క్రేజీ ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ఈ యానిమల్ బ్యూటీ ఆడిపాడనున్నట్లు టాక్.
ప్రస్తుతం భారీ అంచనాల మధ్య రూపొందుతున్న పుష్ప 2లో రష్మిక మందన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక స్పెషల్ సాంగ్ జాన్వీ అని టాక్.
అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో కీలకపాత్రలో త్రిప్తి కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.
భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాను ఆగస్ట్ 15న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక ఇందులో పలువురు బీటౌన్ స్టార్స్ ఉన్నారట.
పుష్పరాజ్ అనుచరుడిని ట్రాప్ చేసే రోల్ లో త్రిప్తి కనిపించనుందని.. ఇప్పటికే ఈ బ్యూటీని పుష్ప మేకర్స్ ఫైనల్ చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది.
పాత్ర చిన్నదే అయినా.. త్రిప్తి రోల్ ఈ సినిమాపై మరింత ఎఫెక్ట్ ఉంటుంది.. బన్నీ, త్రిప్తి కాంబోలో వచ్చే సీన్స్ హైలెట్ కానున్నాయని టాక్.
ఇక్కడ క్లిక్ చేయండి.