TV9 Telugu
23 February 2024
మరో క్రేజీ ప్రాజెక్ట్ లో త్రిప్తి డిమ్రి.! కియారా అవుట్.
యానిమల్తో మూవీతో త్రిప్తి డిమ్రి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో వరస అవకాశాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో నేషనల్ క్రష్ ట్యాగ్ అందుకుంది త్రిప్తి. అయితే ఈ బ్యూటీ కనిపించింది తక్కువే అయినా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ మూవీతో ఆ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో అటు అన్ని ఇండస్ట్రీలలోనూ ఆఫర్స్ వరసగా వస్తున్నాయి.
తాజాగా బాలీవుడ్ లో మరో ప్రాజెక్ట్ ఛాన్స్ అందుకుంది. హార్రర్ కామెడీ ఫ్రాంచైజీ భూల్ భూలయ్యా సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
ఫస్ట్ పార్టులో అక్షయ్ కుమార్, మంజూలిక విద్యాబాలన్.. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ లో కియారా అద్వానీ, కార్తీక్ ఆర్యన్ జంటగా నటించారు.
హీరో కార్తీక్ ఆర్యన్ సోషల్ మీడియా ఖాతాలో భూల్ భూలయ్యా 3 మూవీ గురించి ఓ పజిల్ షేర్ చేశాడు. అందులో త్రిప్తి ఫుల్ ఫోటో షేర్ చేశారు.
భూల్ భూలయ్య3లో కియారా అద్వానీ స్థానంలో త్రిప్తి ఎంపికైనట్లు అధికారికంగా వెల్లడించారు. అటు ఆషీకి 3లోనూ త్రిప్తి ఎంపికైన సంగతి తెలిసిందే.
ఇక్కడ క్లిక్ చెయ్యండి