రెట్రో లుక్ లో కుర్రకారును రెచ్చకొడుతున్న త్రిప్తి దిమ్రీ

Phani CH

14 SEp 2024

ఒకే ఒక్క సినిమాతో నేషనల్ క్రష్‏గా మారిపోయింది హీరోయిన్ త్రిప్తి దిమ్రీ. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమాతో ఒకేసారిగా ఫేమస్ అయ్యింది.

అందం, అభినయం, గ్లామర్ తో కట్టిపడేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం క్రితమే ఎంట్రీ ఇచ్చిన ఈ తార.. విభిన్న పాత్రలు పోషించి ఆకట్టుకుంది.

కానీ యానిమల్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

2012లోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది త్రిప్తి. హిందీలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ యానిమల్ సినిమాతోనే ఈ బ్యూటీకి క్రేజ్ వచ్చింది.

దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సామేతను చక్కగా ఫాలో అవుతూ ముంబయ్‌లో కాస్త గట్టిగానే ఆస్తులు కూడబెడుతోందట ఈబ్యూటీ.

గతంలో ప్రముఖ వ్యాపారవేత్త సామ్ మర్చంట్ తో త్రిప్తి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరు తమ ప్రేమ గురించి అధికారికంగా వెల్లడించలేదు.

యానిమల్ మూవీతో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. ఈ సినిమా తర్వాత ఆమె 'బ్యాడ్‌ న్యూజ్‌'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.