TV9 Telugu

సౌత్ హీరోస్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ లిస్ట్.! టాప్ లో వాళ్ళే..

23 March 2024

ఈ మధ్య సౌత్ హీరోస్ కి పాన్ ఇండియా లెవల్లో ఫాలోయర్స్ ఉన్నారు. అందులో టాప్ హీరోస్ ఎవరో ఇక్కడ తెలుసుకోండి.

టాలీవుడ్ లో  25 మిలియన్ ఫాలోయర్స్‌తో టాప్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. పుష్పతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు.

21.3 మిలియన్ ఫాలోయర్స్‌తో రౌడీ హీరో విజయ్ దేవరకొండ రెండో స్థానంలో నిలిచారు. లైగర్ తో పాన్ ఇండియా హీరో అయ్యారు.

ఇక ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో రామ్ చరణ్ 20.8 మిలియన్ ఫాలోయర్స్‌తో మూడో స్థానం

సీతారామం సినిమాతో ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న దుల్కర్ సల్మాన్ 14.1 మిలియన్ ఫాలోయర్స్‌తో 4వ స్థానం

కేజియఫ్ సినిమాతో ఇండస్ట్రీ మొత్తం తనవైపు చూసేలా చేసిన కన్నడ స్టార్ యశ్‌కు 13.5 మిలియన్ ఫాలోయర్స్‌ ఉన్నారు.

టాలీవుడ్ టాప్ హీరోలో ఒకరైన మహేష్ బాబుకు 13.4 మిలియన్ ఫాలోయర్స్‌.ఈయన పాన్ ఇండియా సినిమా చెయ్యకపోయినా అదే క్రేజ్.

టాలీవుడ్ మొట్టమొదటి పాన్ ఐడియా స్టార్ ప్రభాస్‌కు 11.7 మిలియన్ ఫాలోయర్స్. నాని, ఎన్టీఆర్ 7.3 మిలియన్ ఫాలోయర్స్‌.