ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్.. ఆహాలో విశ్వక్ కొత్త షో..
07 September 2023
పవన్ కల్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఈ రోజు నుంచి రెజ్యూమ్ కానుంది. యాక్షన్ సీన్ చిత్రీకరణ జరగబోతుందన్న క్లారిటీ ఇచ్చింది.
సలార్ అఫీషియల్ ట్విటర్ పేజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌కు సంబంధించిన అప్‌డేట్ షేర్ చేయటంతో వాయిదా వార్తలు రూమర్సేనా అన్న అనుమానం కలుగుతోంది.
పుష్ప 2 సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను కలుపుకుని ఈ సినిమా వెయ్యి కోట్ల వరకు బిజినెస్ చేసిందట. దీనికి మించేలా ఇంకొన్ని భేరసారాలు కూడా జరుగుతున్నాయట.
విజయ్ దేవరకొండ ఖుషి మొదటి వీకెండ్ బాగా యూజ్ చేసుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఏకంగా 70 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది.
ఖుషి సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్న విజయ్ తన రెమ్యూనరేషన్‌లో కోటీ రూపాయలను 100 మంది అభిమానులకు ఆర్ధిక సాయంగా అందిస్తున్నట్టుగా ప్రకటించారు.
లియో సినిమా షూటింగ్ కోసం రిస్క్ చేశారు హీరో విజయ్. కశ్మీర్ షెడ్యూల్‌లో మైనస్ 10 డిగ్రీల టెంపరేచర్ కండిషన్‌లో కేవలం టీషర్ట్‌తో షూటింగ్‌లో పాల్గొన్నారు.
సలార్ వాయిదా పడిందనే విషయం తెలియగానే.. సెప్టెంబర్ 28పై ఖర్చీఫ్ వేసారు రామ్. ఈయన స్కంద సెప్టెంబర్ 15 నుంచి 28కి ఫిక్స్ అయింది.
'మార్క్ ఆంటోనీ' సినిమా ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. దాంతో హీరో విశాల్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
విశ్వక్ సేన్ హోస్ట్ చేయబోతోన్న కొత్త షో ‘ఫ్యామిలీ ధమాకా’. సెప్టెంబర్ 8న రాత్రి 8 గంటలకు ప్రీమియర్ ప్రారంభం అవుతుందని ఆహా ప్రకటించింది.