టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు టాప్ 9 సినీ విశేషాలు..
సైమా బెస్ట్ యాక్టర్ గా.. ట్రిపుల్ ఆర్ సినిమాకు గాను.. నామినేట్ అయిన తారక్.. అందరూ అనుకున్నట్టే.. ఆ అవార్డ్‌ను గెలుచుకున్నారు. అందరి అరుపుల మధ్యలో.. ఠీవీగా.. సైమా అవార్డ్ అందుకున్నారు.
నవీన్ పొలిశెట్టి హీరోగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఓవర్సీస్‌లో ఇప్పటికే 1.4 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకున్న ఈ చిత్రం.. ఫుల్ రన్‌లో 1.8 నుంచి 2 మిలియన్ డాలర్స్ చేరుకుంది.
ఖుషి సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ తాజాగా నాని హాయ్ నాన్న సినిమాతో వచ్చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ విడుదలైంది.
రామ్ పోతినేని హీరో స్కంద చిత్రంపై మంచి హైప్ ఉంది. ఈ సినిమాలోని మాస్ పాట కల్ట్ మామాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. సెప్టెంబర్ 18న విడుదల కానుంది ఈ పాట.
తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ నడుస్తుంది. ఎన్నికలకు ముందు యాత్ర 2 రానుంది. వైఎస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు ఈ చిత్ర సెట్స్‌లో సెప్టెంబర్ 20 నుంచి మమ్ముట్టి జాయిన్ కానున్నారు.
కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డెవిల్. పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు మారిపోయాడు. తాజాగా ఈ సినిమా నిర్మాత దర్శకుడు అభిషేక్ నామా అంటూ ఎనౌన్స్ చేయటం ఆసక్తికరంగా మారింది.
ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన షారూఖ్ ఖాన్ హ్యాట్రిక్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. డంకీ, డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరో బాలీవుడ్ స్టార్ కిడ్ సౌత్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. శ్రీదేవి వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న ఖుషీ కపూర్ త్వరలో ఓ తమిళ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
క్రిస్మస్ సినిమాలకు ఆక్వామెన్ సినిమాతో పెద్ద దెబ్బ పడబోతుంది. ఈ సినిమా రాకతో ఓవర్సీస్‌లో హాయ్ నాన్నతో పాటు సైంధవ్, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలకు భారీ దెబ్బ తప్పదనే టాక్ వస్తోంది. ఆక్వామ్యాన్ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.