అనుష్క టాప్ 5 కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్..

12 September 2023

టాలీవుడ్‌లో తనదైన శైలి ముద్ర వేశారు అనుష్క శెట్టి. తన నటనతో ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.

కింగ్ నాగార్జున సూపర్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ తెలుగు, తమిళంలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు.

ఈమె నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇప్పుడు జేజమ్మ చేసిన టాప్ 5 కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఏంటో తెలుసుకుందాం.

స్వీటీ బెస్ట్ పెర్ఫార్మన్స్ అంటే మొదట గుర్తొచ్చేది అరుంధతి. ఈ చిత్రంలో రాజసాన్ని చూపిస్తూ నటించిన జేజమ్మ పాత్రతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

బాహుబలి సిరీస్ లో దేవసేన పాత్రతో అందరిని ఆకట్టుకున్నారు. అందమైన కుంతల రాజ్య యువరాణిగా, మాహిష్మతి బందీగా ఉన్న వృద్ధురాలిగా మెప్పించారు.

పంచాక్షరీ చిత్రంలో అనుష్క పంచాక్షరీ రోల్ ఎంతో బాగుంటుంది. ఈ చిత్రం ఫలితం ఎలా ఉన్న స్వీటీ నటన మాత్రం ఆకట్టుకొనేలా ఉంటుంది.

అనుష్క నటించిన మరో హారర్ చిత్రం భాగమతి. ఈ చిత్రం కలెక్టర్ చంచలగా, భాగమతిగా ప్రేక్షకులను భయపెట్టారు టాలీవుడ్ దేవసేన.

గుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమదేవి చిత్రంలో రుద్రమదేవి పాత్రలో విమర్శకుల ప్రశంసల అందుకున్నారు లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి.