ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన టాప్ 10 సినిమాలు ఇవే.. 

Battula Prudvi

14 October 2024

2009లో వచ్చిన 'అవతార్' $2.92 బిలియన్ల వసూళ్లతో ప్రపంచంలో టాప్ ప్లేస్‎లో నిలిచింది. ఇది జేమ్స్ కామెరాన్ తెరకెక్కించారు.

మర్వెల్ స్టూడియోస్ 2019లో రూపొందించిన 'ఎవెంజర్స్: ఎండ్‌గేమ్' ప్రపంచవ్యాప్తంగా $2.79 బిలియన్లు కొల్లగొట్టి టాప్ 2లో నిలిచింది.

2022లో 'అవతార్' సినిమాకి కొనసాగింపుగా తెరకెక్కిన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' $2.32 బిలియన్ల వసూళ్లతో మూడవ స్థానం పొందింది.

1997లో నిజజీవిత సంఘటనల ఆధారంగా వచ్చిన 'టైటానిక్' సినిమా $2.26 బిలియన్లతో నాలుగవ స్థానం దక్కించుకుంది.

2015లో తెరకెక్కిన 'స్టార్ వార్స్: ఎపిసోడ్ VII - ది ఫోర్స్ అవేకెన్స్' $2.07 బిలియన్ల వసూళ్లతో టాప్ 5లో ఉంది.

2018లో మర్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్' $2.05 బిలియన్లతో సిక్స్త్ ప్లేస్ కొట్టింది.

మర్వెల్ మరో సినిమా 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' ఏడవ స్థానంలో ఉంది. 2021లో వచ్చిన ఈ మూవీ $1.92 బిలియన్ వసూళ్లు చేసింది.

2015లో డైనోసార్ బేస్ చేసుకొని వచ్చిన 'జురాసిక్ వరల్డ్' $1.67 బిలియన్లతో ఎనిమిదవ స్థానం దక్కించుకుంది.

ఈ ఏడాది తెరకెక్కిన హాలీవుడ్ ఫిల్మ్ 'ఇన్‌సైడ్ అవుట్ 2' $1.66 బిలియన్ల వసూళ్లతో తొమ్మిదవ స్థానంలో నిలిచింది.

2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం 'ది లయన్ కింగ్' వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద $1.66 బిలియన్లు కొల్లగొట్టి టాప్ 10లో ఉంది.