TV9 Telugu

ఆసియాలోనే టాలీవుడ్‌ నుంచి ఒకే ఒక్కడు.. దటీజ్ NTR.

24 December 2023

ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్‌ వైడ్ బజ్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2023 ఇయర్ ఎండ్ మరో సారి సెన్సేషనల్ గా మారిపోయారు.

ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్‌ వైడ్ బజ్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2023 ఇయర్ ఎండ్ మరో సారి సెన్సేషనల్ గా మారిపోయారు.

నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. తన ఫ్యాన్స్‌ను కాలర్ ఎగరేసేలా చేశారు. ఏషియన్ వీక్లీ మ్యాగజీన్ ప్రతీ ఇయర్ ఎండింగ్ లో ఓ సర్వే చేస్తుంది.

ఆసియాలోనే.. ఆయేడు విపరీతంగా పాపులర్ అయిన సెలబ్రిటీలకు ర్యాంకింగ్స్‌ ఇస్తుంది.

ఇక 2023 ఇయర్ ఎండ్ లోనూ ఇదే చేసిన ఏషియన్ వీక్లీ మ్యాగజీన్  2023లో ఆసియాలోనే టాప్ 50 యాక్టర్స్‌ జాబితాను విడుదల చేసింది.

ఇక అందులో టాలీవుడ్‌ నుంచి ఒక్క ఎన్టీఆర్ మాత్రమే స్థానం దక్కించుకున్నారు.

25వ స్థానంలో లిస్టవుట్ అయ్యారు. ఇక ఈ లిస్టులో మొదటి స్థానంలో బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ ఖాన్ నిలవగా..

సౌత్ ఇండియా నుంచి కోలీవుడ్ హీరో విజయ్‌ దళపతి 8వ స్థానాన్ని దక్కించుకున్నాడు.