కల్కి సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే చిరంజీవి, రజనీకాంత్ దగ్గర్నుంచి మొదలుకొని ప్రముఖులు నాగ్ అశ్విన్ అండ్ టీంపై ప్రశంసల కురిపించారు.
పెద్ద పెద్ద కలలు కంటూ, భారత జెండాను పైపైకి ఎగరేయాలని ఆకాంక్షించారు మెగాస్టార్ చిరంజీవి. కల్కి సినిమా రిపోర్డు విని సంతోషించినట్టు చెప్పారు.
ప్రభాస్, అమితాబ్, కమల్, దీపిక నటించిన మైథో - సైఫై - ఫ్యూచరిస్టిక్ సినిమా కల్కిని కొనియాడారు. టీమ్ కృషిని అభినందించారు చిరంజీవి.
నాగ్ అశ్విన్ విజన్‌ని ప్రశంసించారు హీరో యష్. కల్కి సినిమాను నాగీ తెరకెక్కించిన విధానం చూసి పలువురు స్ఫూర్తి పొందుతారని అన్నారు.
కల్కి సినిమా చూశానని, విజువల్‌గా అద్భుతంగా ఉందని, తెరమీద కథలను మరింత సృజనాత్మకంగా చెప్పడానికి ఇలాంటి సినిమాలు మార్గదర్శకంగా ఉంటాయని అన్నారు.
తాజాగా అల్లు అర్జున్ సైతం కల్కి సినిమా చూసి ఫిదా అయిపోయారు. చిత్రయూనిట్‌ను ఆకాశానికి ఎత్తేసారు బన్నీ.
కల్కి సినిమాలోని సన్నివేశాలను పంచుకోవద్దని కోరింది నిర్మాణ సంస్థ. పైరసీని ప్రోత్సహించవద్దంటూ సోషల్ మీడియాలో ప్రకటించింది.
ఎంతో మంది నాలుగేళ్లు కష్టపడి తెరకెక్కించారని, ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించే విషయాలను షేర్ చేయవద్దని రిక్వెస్ట్ చేసింది వైజయంతీ సంస్థ.
భారతదేశంలోని అతిపెద్ద మల్టీప్లెక్స్‌ల్లో వినిపించే మొదటి పేరు రాజధాని ఢిల్లీలోని PVR డైరెక్టర్స్ కట్.