‘విక్రమార్కుడు’ ని మిస్ చేసుకున్న స్టార్లు ఎవరంటే ??

మాస్ మహారాజ్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఏకైక బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమార్కుడు’.

2006 వ సంవత్సరం జూన్ 23న ఈ చిత్రం విడుదలైంది. ‘శ్రీ కీర్తి క్రియేషన్స్’ బ్యానర్ పై ఎం.ఎల్.కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం అప్పటికి రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఈ చిత్రంలో రవితేజ.. అత్తిలి సత్తిబాబు, విక్రమ్ సింగ్ రాథోడ్ వంటి రెండు విభిన్నమైన పాత్రల్లో ద్విపాత్రాభినయం కనపరిచి అలరించాడు.

నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 16 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అయితే  ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన స్టార్లు కొంతమంది ఉన్నారు.

రాజమౌళి ఈ కథని మొదట బాలకృష్ణ కోసం అనుకున్నాడట.

అయితే అతని తండ్రి విజయేంద్రప్రసాద్ పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని రాసాడట.

వాళ్లిద్దరూ కూడా ‘విక్రమార్కుడు’ కథలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో రవితేజతో ముందుకు వెళ్ళాడు ఎస్.ఎస్.రాజమౌళి.

అలాగే విలన్ పాత్ర కోసం అజయ్ కంటే ముందు ఓ బాలీవుడ్ సీనియర్ హీరోని అనుకున్నాడట. అతను వివేక్ ఒబెరాయ్ అని అప్పట్లో టాక్ బలంగా నడిచింది.