మాస్ పాటల పల్లకిలో టాలీవుడ్..

TV9 Telugu

08 March 2024

మిగిలిన ఇండస్ట్రీల పరిస్థితి ఎలా ఉన్నా, టాలీవుడ్‌ సినిమాలో మాత్రం కచ్చితంగా మాస్ డ్యాన్సులు ఉండాల్సిందే.

తెలుగు సినిమాల్లో హీరోలు ఎంత స్పీడ్‌గా స్టెప్పులేస్తే అంత క్రేజ్‌ సినిమాకి వస్తుంది. ఎంతగా ఫ్లోర్‌డ్యాన్స్ చేస్తే అంత తోపు అన్నట్టు.

చాన్నాళ్ల తర్వాత సెట్స్ మీదున్న స్టార్‌ హీరోల సినిమాల్లో ఒకేసారి మాస్ బీట్ పాటల సందడి కనిపిస్తోంది.

ఇటలీలో దిశా పటాని కలిసి ప్రభాస్‌ డ్యాన్సులు చేస్తున్నారు. ఈ పాట కోసం కల్కి యూనిట్‌ స్పెషల్‌ ఫ్లైట్‌లో లొకేషన్‌కి చేరుకుంది.

డార్లింగ్‌ని దిశా ఫొటో తీస్తున్న పిక్‌ నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఈ సాంగ్ ఈ సినిమా రేంజ్ మరింత పెంచనుంది.

అటు విశ్వంభర సినిమా కోసం చిరు స్టెప్పులేస్తున్నారు. ఆయనతో పాటు హీరోయిన్ త్రిష కూడా కాలు కదుపుతున్నారు.

అంతే కాదు, మరో ఐదుగురు భామలు ఈ సాంగ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.  ఇటు పుష్ప సీక్వెల్‌ యూనిట్‌ కూడా పాటతో సందడి చేస్తోంది.

ఒకేసారి రెబెల్ స్టార్ టు ఐకాన్‌స్టార్‌ అందరూ పాటల పల్లకిలో తేలుతుంటే 'మేం హ్యాపీ అన్నా' అని తమ అభిమాన హీరోలతో అంటున్నారు ఫ్యాన్స్.