టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌.. వారి పారితోషకం

TV9 Telugu

19 April 2024

టాలీవుడ్ లో సీనియర్ టాప్ హీరోయిన్‌గా నటిస్తున్న అనుష్క శెట్టి సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ ఛాయిస్ అయితే ఈమె రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది

నయనతార చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి దాదాపుగా  2 దశాబ్దాలు అవుతుంది. అయితే ప్రస్తుతం ఈమె ఒక్కోసినిమాకు దాదాపు 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది.

సమంత ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా అలరిస్తోంది. ఈమె ఒక్కో చిత్రానికి దాదాపు రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. 

ముద్దుగుమ్మ త్రిష కూడా దాదాపుగా కథానాయిగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది అయితే ఈమె ఒక్కో సినిమాకు రూ. 2 కోట్ల నుంచి 2.5 కోట్ల వరకు తీసుకుంటుంది.

కాజల్ పెళ్లై న తర్వాత కూడా కథానాయికగా అలరిస్తోంది. అయితే భగవంత్ కేసరి సినిమా కోసం దాదాపు రూ. 2 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు సమాచారం.

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌లలో తమన్నా ఒకరు. ఈమె ఒక్కో సినిమాకు రూ. కోటి వరకు పారితోషకం తీసుకుంటున్నట్టు సమాచారం.

రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రస్తుతం డిమాండ్ బాగా తగ్గింది. అందుకే ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ. 70 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.