దీపావళి సందర్భంగా దాదాపు అప్ కమింగ్ సినిమాలన్నీ ఏదో ఒక అప్‌డేట్ ఇచ్చాయి. సీనియర్స్ నుంచి యంగ్ హీరోల వరకు ప్రతీ ఒక్కరు ఫ్యాన్స్ ను ఖుషీ చేసారు.
ఓజీ టీమ్ నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. దీపావళి శుభాకాంక్షలు జపనీస్ భాషలో చెప్పటంతో ఈ సినిమా కథ జపాన్‌లో కూడా జరుగుతుందన్న హింట్ ఇచ్చారు.
విజువల్ వండర్ హనుమాన్ టీమ్ కూడా దీవాళి అప్‌డేట్ ఇచ్చింది. ఇప్పటికే టీజర్, ఒక సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్.
సెకండ్ సింగిల్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. నవంబర్ 14న సూపర్ హీరో హనుమాన్ అంటూ సాగే సెకండ్ సాంగ్ రిలీజ్ కానుంది వెల్లడించారు.
సంక్రాంతి సీజన్‌నే టార్గెట్ చేస్తున్న సీనియర్ హీరో వెంకీ కూడా దీపావళి సందర్భంగా సైందవ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ నవంబర్ 21న రిలీజ్ అవుతుందని వెల్లడించారు.