శుభాకాంక్షలు తెలిపిన సెలెబ్రిటీలు.. చేగువరా జీవిత కథ ఆధారంగా సినిమా..
14 November 2023
దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు స్టార్స్. ఇంటిని ముగ్గులు, దీపాలతో అలకరించిన ఫోటోస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
సలార్ నుంచి మేజర్ అప్‌డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను డిసెంబర్ 1న రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించింది.
దీపావళి కానుకగా వచ్చిన ఈ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
క్యూబా పోరాట యోధుడు చేగువరా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తెలుగు సినిమా చే. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
బీఆర్ సభావత్ నాయక్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్నరు. లావణ్య సమీరా, పూల సిద్ధేశ్వర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి రవి శంకర్ సంగీతమందిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన టైగర్ 3 ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హీరోయిన్ కత్రినా కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
'ఈ సినిమా నా ఓర్పును పరీక్షించింది. నా శక్తికి మించి నటించేలా, కష్టపడేలా చేసింది. ఎంతో నొప్పిని భరిస్తూ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్‌లో నటించా' అన్నారు కత్రినా.
ఈ చిత్రం మొదటి రోజు 44.5 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం. దినికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.