ప్రజెంట్ పాన్ ఇండియా హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్న సమంత గ్లామర్ షో విషయంలో కాస్త బోల్డ్‌గానే కనిపిస్తున్నారు.
రెగ్యులర్‌గా వర్క్ అవుట్స్ చేస్తూ జీరో ఫిగర్‌కు చేరువైన ఈ బ్యూటీ హాట్ హాట్ లుక్స్‌తో అలరిస్తున్నారు.
సమంత రేంజ్‌లో కాకపోయినా గ్లామర్ షో విషయంలో నేను కూడా తగ్గేదే లే అంటున్నారు సాండల్‌వుడ్ శ్రీవల్లి రష్మిక మందన్న.
పాన్ ఇండియా స్థాయిలో హవా చూపిస్తున్న ఈ భామ బాలీవుడ్ సినిమాలకు ఓకే చెప్పటమే కాదు... బాలీవుడ్ భామలకు పోటి ఇచ్చే రేంజ్‌లో ఫోటో షూట్‌లు కూడా చేస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు పక్కింటి అమ్మాయిలా కనిపించిన హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ మధ్య కాస్త స్పీడు పెంచారు.
హోమ్లీ ఇమేజ్‌ను నుంచి గ్లామర్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చి కమర్షియల్ ఫార్మాట్‌కు తాను కూడా రెడీ అన్న సిగ్నల్ ఇచ్చేలా ట్రెండీ ఫోటో షూట్స్‌తో రచ్చ చేస్తున్నారు.
బొద్దుగుమ్మగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రాశీఖన్నా... ఇప్పుడు అల్ట్రా గ్లామరస్ లుక్‌లో అదరగొడుతున్నారు.
ప్రజెంట్ నార్త్‌లో డిజిటల్ ప్రాజెక్ట్స్‌తో బిజీ కావటంతో ఉత్తరాది భామలకు పోటి ఇచ్చే రేంజ్‌లో గ్లామర్ షో చేస్తున్నారు.