17 ఏళ్లకే హీరోయిన్‌గా ఎంట్రీ.. ఆపై పెళ్లి, విడాకులు, వివాదాలు.. ఎవరంటే.?

03 December 2024

Ravi Kiran

2002లో బాలీవుడ్ చిత్రం మక్డీలో బాలనటిగా రంగప్రవేశం చేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత కహానీ ఘర్ ఘర్ కీ అనే టీవీ సీరియల్‌తో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో కొత్త బంగారులోకం సినిమాతో పరిచయమైంది. తనదైనశైలి నటనతో తొలి చిత్రంతోనే ప్రేక్షకులకు చేరువైంది. తొలి సినిమా తర్వాత ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ

ఈ బ్యూటీకి ఆఫర్స్ రాలేదు. ఈ అమ్మడు నటించిన చిత్రాలు సైతం డిజాస్టర్స్ కావడంతో ఇండస్ట్రీకే దూరమైంది. ఆ తర్వాత బాలీవుడ్‌కి పయనమైంది. ఇంతకీ ఈమె మరెవరో కాదు శ్వేత బసు ప్రసాద్

1991 జనవరి 11న జంషెడ్‌పూర్‌లో జన్మించిన శ్వేత చిన్నతనంలోనే ముంబైకి వచ్చింది. 2014లో హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో పట్టుబడిన శ్వేత పేరు వివాదంలోకి వచ్చింది. 

ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఓ కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అసలు నిందితులను పట్టుకున్న పోలీసులు.. కొన్ని నెలల తర్వాత శ్వేతకు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. 

ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని తేల్చారు. 2018లో, శ్వేత ఒక వ్యక్తిని రహస్యంగా వివాహం చేసుకుంది, కానీ 9 నెలల్లో విడాకులు తీసుకుంది.

ఇప్పుడిప్పుడే హిందీ వెబ్ సిరీస్‌లతో రీఎంట్రీ ఇచ్చిన శ్వేత.. అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పుడూ ఏదొక ఫోటో షూట్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.