బుల్లితెరపై హోస్టుగా చేసిన హీరోలు వీరే..
TV9 Telugu
26 August 2024
ప్రస్తుతం మిరాయి సినిమా చేస్తున్న మంచు మనోజ్ ఈటీవీ విన్లో ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం అంటూ గేమ్ షోతో గేమ్ షోకి హోస్టుగా వ్యవహరిస్తున్నారు.
విశ్వక్ సేన్ సైతం ఈ మధ్యే ఆహాలో ఫ్యామిలీ ధమాకాతో బాగానే ఆకట్టుకుంటున్నారు. వరస సినిమాలతో పాటు గేమ్ షోకు డేట్స్ ఇచ్చారు మాస్ కా దాస్.
విశ్వక్ సేన్ కంటే ముందే బాలయ్యను సైతం హోస్టుగా మార్చేసారు ఆహా టీం. అన్‌స్టాపబుల్ షో అయితే ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది.
మరోవైపు నాగార్జున గురించి చెప్పనక్కర్లేదు. ఇటు సినిమాలు చేస్తూనే.. బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తున్నారు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా హోస్ట్ చేసారు.
రానా హోస్ట్ చేస్తున్న టాక్ షో నెంబర్ 1 యారి కూడా బాగా పాపులర్ అయింది. ఇందులో తెలుగు నటులతో సందడి చేసారు రానా.
గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ 1, జెమినిలో ఎవరు మీలో కోటీశ్వరులు షోలను హోస్ట్ చేసారు.
నాచురల్ స్టార్ నాని కూడా స్టార్ మాలో ప్రసారం అవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2కి హోస్టుగా చేసారు.
టాలీవుడ్ పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి కూడా స్టార్ మాలో మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 4కి హోస్టుగా వ్యవహరించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి