సొంత నిర్మాణ సంస్థలు ఉన్న హీరోలు వీరే..

TV9 Telugu

09 June 2024

మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ 'జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్'ని నడుపుతున్నారు. ఈ సంస్థ తొలి చిత్రం 'శ్రీమంతుడు'.

2016లో రామ్ చరణ్ 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ'ని స్థాపించారు. ఇటీవల స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలిసి 'వీ మెగా పిక్చర్స్' కూడా స్టార్ట్ చేసారు.

నందమూరి కళ్యాణ్‌రామ్ తన తాత నందమూరి తారక రామారావు పేరు మీద 2005లో 'ఎన్టీఆర్ ఆర్ట్స్‌'ని స్థాపించారు.

నాని 'వాల్ పోస్టర్ సినిమా'ని 2017లో స్థాపించారు. దీనిలో తొలి చిత్రం 'ఆ'. హిట్ సినిమా సిరీస్ కూడా ఈ సంస్థలోనే వస్తున్నాయి.

నితిన్ తన తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితారెడ్డి సహకారంతో స్వయంగా స్థాపించిన 'శ్రేష్ట్ మూవీస్'ని ప్రారంభించారు.

పవన్ కళ్యాణ్ కి 'PK క్రియేటివ్ వర్క్స్' అనే సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఇందులో ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాలు వచ్చాయి.

మంచు విష్ణు 2007లో '24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ' అనే చలనచిత్ర నిర్మాణ సంస్థ స్థాపించారు. వస్తాడు నా రాజు ఈ సంస్థ తొలి చిత్రం.

శర్వానంద్ కూడా 'శర్వా ఆర్ట్స్' అనే ప్రొడక్షన్ కంపెనీ 2012 స్టార్ట్ చేసారు. ఇందులో 'కో అంటే కోటి' సినిమా నిర్మించారు.