చూస్తున్నారుగా.. మన తెలుగు ఇండస్ట్రీ హీరోలు అందరు ఎంతగా ముంబైలో తమ సినిమాల కోసం ప్రమోట్ చేసుకున్నారో..?
ఈ మధ్య హిందీ మార్కెట్ కూడా కావాలని మెంటల్‌గా ఫిక్సైపోయారు.. అందుకే ప్రతీ సినిమాను హిందీలోనూ విడుదల చేయాలని చూస్తున్నారు.
దానికోసమే ముంబైకి వెళ్లి అక్కడ ప్రమోషన్ చేసుకుంటున్నారు. నాని, విజయ్ దేవరకొండ, రవితేజ.. ఇలా అంతా ఒకే దారిలోనే వెళ్తున్నారు.
హిందీ మార్కెట్ కోసం ఎన్నో తంటాలు పడుతున్నా.. అక్కడి ఆడియన్స్ మాత్రం మన సినిమాలను అస్సలు పట్టించుకోవడం లేదు.
ట్రిపుల్ ఆర్, పుష్ప, కార్తికేయ 2 లాంటి సినిమాలు మినహాయిస్తే.. ఈ మధ్య ఏదీ హిందీలో కనీస వసూళ్లు తేలేదు.
ఎక్కడి వరకో ఎందుకు.. తాజాగా టైగర్ నాగేశ్వరరావు కోసం రవితేజ 10 రోజులకు పైగానే ముంబైలో ప్రమోషన్ చేస్తే.. ఈ సినిమాకు మినిమమ్ కలెక్షన్స్ రాలేదు.
దసరా కోసం నాని కూడా ముంబైని జల్లడపట్టారు.. కానీ ఫలితం శూన్యం. ఇక విజయ్ దేవరకొండ అయితే లైగర్ కోసం చెప్పులరిగేలా తిరిగితే కనీస ఓపెనింగ్స్ రాలేదు.
గాడ్ ఫాదర్‌లో సల్మాన్ ఉన్నా.. సైరాలో అమితాబ్ ఉన్నా.. చిరంజీవిని పట్టించుకోలేదు నార్త్ ఆడియన్స్. అందరికీ బాలీవుడ్ మార్కెట్ అందదనేది.. దానిక్కూడా టైమ్ రావాలంతే.