ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో అర్ధంకాలేదు.. విజయ్ ఎమోషనల్ కామెంట్స్ 

Rajeev 

15 June 2024

టాలీవుడ్ లో ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ. 

హీరోగా సినిమాలు చేయక ముందు చిన్న చిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు విజయ్. 

ఆతర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆతర్వాత అర్జున్ రెడ్డి చేశాడు. 

అర్జున్ రెడ్డి సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. 

ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు విజయ్ దేవరకొండ. 

తాజాగా విజయ్ డియర్ కామ్రేడ్ సినిమా గురించి మాట్లాడాడు. తాజాగా డియర్ కామ్రేడ్ హిందీ వర్షన్ 400 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

కానీ ఈ మూవీ థియేటర్స్ లో డిజాస్టర్ అయ్యింది. విజయ్ మాట్లాడుతూ.. కామ్రేడ్ మూవీ నాకు ఎంతో నచ్చిన సినిమా.. ఎందుకు ఫ్లాప్ అయ్యిందో అర్ధంకావడంలేదు అని అన్నాడు.