శివమణి సినిమాని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా ??
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కుదిరితే చాలా బాగుంటుందని అనుకుంటూ ఉంటాము.
అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి విక్టరీ వెంకటేష్ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్.
అయితే అప్పట్లో వీళ్ళ కలయిక ఒక సినిమా చెయ్యాలని చర్చలు మాత్రం నడిచాయట.
కానీ వెంకటేష్ కి సెకండ్ హాఫ్ పెద్దగా నచ్చకపోవడం తో ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేసాడు.
ఆ సినిమా మరేదో కాదు, అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘శివమణి’ అనే చిత్రం.
ఈ సినిమాని తొలుత వెంకటేష్ తోనే చెయ్యాలని కథని రాసుకున్నది పూరి జగన్నాథ్,
ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక సినిమాలాగా, సెకండ్ హాఫ్ మొత్తం మరో సినిమాలాగా అనిపిస్తుందని చెప్పాడట వెంకటేష్.
అయితే కథలో మార్పులు చేసేందుకు స్కోప్ లేకపోవం తో వెంకటేష్ ఈ కథకి నో చెప్పాడట.
ఆ తర్వాత ఇదే కథని కొన్నాళ్ళకు పూరి జగన్నాథ్ అక్కినేని నాగార్జున ని కలిసి, ఇదే కథని వినిపించాడట.
ఆయనకీ తెగ నచ్చేసింది. వెంటనే షూటింగ్ మొదలు పెట్టారు.
ఇక్కడ క్లిక్ చేయండి