పెళ్లికళ వచ్చేసిందే బాల.. ఆ యంగ్ హీరోతో శ్రీముఖి పెళ్లి .? 

TV9 Telugu

02 April 2024

బుల్లి తెరపై తన సత్తా చాటుకుంటూ యాంకర్ గా దూసుకుపోతుంది అందాల  ముద్దుగుమ్మ శ్రీ ముఖి. 

యాంకర్ గా పలు టీవీ షోలు, ప్రోగ్రామ్స్ చేస్తూ తన మాటలతో, అందంతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది శ్రీ ముఖి.

చాలా కాలంగా ఇండస్ట్రీలో రాణిస్తున్న శ్రీముఖి సినిమాల్లోనూ నటించింది ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గానూ చేసింది. 

ఇక శ్రీముఖి పెళ్లి గురించి ఇప్పటికే రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. గతంలో ఈ అమ్మడు పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి. 

తోటి యాంకర్ ప్రదీప్ తో శ్రీముఖి పెళ్లి అనికూడా రూమర్స్ వచ్చాయి. అలాగే బిజినెస్ మ్యాన్ తో పెళ్లి అని కూడా టాక్ వచ్చింది.

ఇకఇప్పుడు మరోసారి శ్రీముఖి పెళ్లి వార్తలు వైరల్ గా మారాయి. టాలీవుడ్ హీరోతో శ్రీముఖి ప్రేమలో ఉందని అంటున్నారు. 

చాలా కాలంగా ఈఇద్దరూ ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.