TV9 Telugu

22 February 2024

బిజినెస్ మెన్‌తో ఏడడుగులు వేసిన హీరోయిన్ సోనారిక.. ఫొటోస్ వైరల్.

ఇప్పుడు ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. సెలబ్రిటీలు వరుసగా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు.

శుభ ముహూర్తాలు ఉండడంతో ఒక్కొక్కరిగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ లిస్ట్ లో ఉన్నారు.

తాజాగా దేవోన్ కే దేవ్ మహాదేవ్‌ సీరియల్‌తో బాగా ఫేమస్ అయిన సోనారిక భడోరియా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.

బుల్లితెరపై సరికొత్త ట్రెండ్ సృష్టించిన మహాదేవ్‌ సీరియల్‌ లో పార్వతిగా నటించి బాగా ఫెమస్ అయ్యింది సోనారిక.

తెలుగులో వరస సినిమాలు చేసి పలు హిట్స్ అందుకున్న సోనారిక ఇప్పుడు తన జీవితంలో పెళ్ళికి శ్రీకారం చుట్టింది.

ప్రముఖ వ్యాపార వేత్త వికాస్ పరశార్ తో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో వీరి వివాహం జరిగింది.

ఇందుకు రాజస్థాన్ లోని రణతంబోర్ వేదికయ్యింది. వివాహ వేడుక అనంతరం తమ పెళ్లి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది సోనారిక. 

పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోనారిక దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.