05 September 2025

పవన్ కళ్యాణ్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న  రాశి ఖన్నా 

Rajeev 

Pic credit - Instagram

ఎంతో మంది కుర్ర హీరోయిన్స్ ఇప్పటికీ స్టార్ డమ్ కోసం ఎదురుచూస్తున్నారు. అవకాశాలు వస్తున్న అదృష్టం కలిసి రాని భామల్లో రాశి ఖన్నా ఒకరు.

ముందుగా ఈ చిన్నది బాలీవుడ్ లో సినిమాలు చేసింది. ఆతర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది 

మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే అందం, నటన పరంగాను రాశీ ఖన్నాకు మంచి మార్కులు పడ్డాయి.

 రాశీ ఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు

అలాగే తమిళ్ లోనూ ఛాన్స్ లు అందుకుంది. తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ సినిమాలోనూ నటించింది. 

కానీ ఈ అమ్మడు అంతగా అవకాశాలు రావడం లేదు. దాంతో ఇటీవలే బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేసింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ పైనే ఈ చిన్నది ఫోకస్ పెడుతుంది. 

దాంతో రాశీ ఖన్నా టాలీవుడ్ కు దూరం అవుతుంది అని అంటున్నారు కొందరు అభిమానులు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది.