దక్షిణాది కథానాయికల్లో నటి నివేదా థామస్ రూటే సపరేటు. విభిన్న పాత్రలతో ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతుంది
TV9 Telugu
'జెంటిల్ మేన్’తో తెలుగు తెరకు పరిచయమై తన నటనతో ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది నివేదా
TV9 Telugu
అయితే నివేదా థామస్ పెళ్లి చేసుకోనున్నారంటూ నెట్టింట ఓ రేంజ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో నటి ఈ వార్తలకు చెక్ పెట్టింది. కొత్త చిత్రాన్ని ప్రకటించి రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది
TV9 Telugu
ఇటీవల తన ఇన్‌స్టా స్టోరీలో ‘ఎన్నో రోజుల తర్వాత.. ఫైనల్లీ’ అని రాశారు. దీనికి లవ్ సింబల్‌ను జోడించారు. ఆ రూమర్స్‌కు చెక్ పెడుతూ ‘చాలా రోజులు వేచి చూశారు. ఇది నా స్పెషల్ ఫిల్మ్’ అని షాకిచ్చింది
TV9 Telugu
తాజాగా మరొకమారు తన కొత్త సినిమా ‘35 చిన్న కథ కాదు’ టీజర్ విడుదల వేడుకలో ఆమె రూమర్స్‌పై మాట్లాడారు. తన పెళ్లిపై జరుగుతున్న ప్రచారంపై నటి నివేదా థామస్ స్పందిస్తూ..
TV9 Telugu
ఈ సినిమా ప్రచారంలో భాగంగా సోషల్ మీడియాలో నేను ఓ ఫొటో పోస్ట్ చేశా. దాన్ని చూసి చాలామంది నాకు పెళ్లి కానుందని భావించారు. దానిపై వార్తలు రాగా మా అమ్మ నాకు ఆ ఫొటో పంపారు. ‘అవునా అమ్మా.. మీరెప్పుడు నా కోసం అబ్బాయిని చూశారు’ అని అడిగానని పేర్కొన్నారు
TV9 Telugu
ఆ చిత్రంలో తన భర్తగా నటించిన విశ్వదేవ్, తన కుమారులుగా నటించిన వారిని ఉద్దేశిస్తూ.. ‘నాకు పెళ్లైంది. ఈయనే నా భర్త. వీళ్లే నా ఇద్దరు పిల్లలు అరుణ్, వరుణ్’ అని సరదాగా చెప్పుకొచ్చారు
TV9 Telugu
ఈ సినిమాలో నివేదా ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తుంది. చైల్డ్ ఆర్టిస్టులు తనను మేడమనో, అక్క అనో కాకుండా అమ్మ అనే పిలిచారంటూ టీజర్ కార్యక్రమంలో నివేదా ఆనందం వ్యక్తం చేశారు. ఈ మువీ ఆగస్టు 15న విడుదల కానుంది