అందాలతో ఆకట్టుకుంటున్న  ఆ రెండు సినిమాల వల్ల ఇబ్బంది పడ్డా: నమిత 

Rajeev 

13 May 2024

చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది హీరోయిన్ నమిత. 

సొంతం సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది ఈ చిన్నది. ఈ సినిమాలో క్యూట్ లుక్స్ తో కవ్వించింది. 

ఆతర్వాత జెమిని సినిమాలో మెరిసింది. కానీ ఉంహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది నమిత.

ఆతర్వాత గుర్తుపట్టలేనంతగా బరువు పెరిగిపోయింది ఈ చిన్నది. చాలా కాలం తర్వాత ప్రభాస్ తో బిల్లా సినిమాలో కనిపించింది.

బిల్లా సినిమాలో తన అందాలతో అదరగొట్టింది ఈ చిన్నది. ఆతర్వాత సింహ సినిమాలో కనిపించింది.

సింహ సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాల్లో మెరిసిన నమిత ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యింది.

తాజాగా నమిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయం చెప్పింది. ధనుష్ హీరో అని చెప్పి మరో హీరోతో సినిమా చేయించారట.

అలాగే మలయాళంలో ఓ బడా నిర్మాత సినిమా అని చెప్పి మరోవేరే నిర్మాత సినిమా చేయించారట. ఆ రెండు సినిమాల వల్ల ఇబ్బందిపడ్డా అని తెలిపింది నమిత.