ఏం అందం రా బాబు..! ఇప్పటికీ అదే వయ్యారం.. క్యూట్‌నెస్ 

30 August 2025

Rajeev 

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. తెలుగులో ఒకప్పుడు తోపు హీరోయిన్ గా రాణించింది కాజల్ అగర్వాల్.

తెలుగులోనే కాదు తమిళ్‌ల్లోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడు సెకండ్ ఇనింగ్స్ మొదలు పెట్టింది.

 ఫస్ట్ మూవీతోనే తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఆతర్వాత బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది

ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన కాజల్.. తెలుగు సినిమా ప్రపంచంలో తనదైన ముద్రవేసింది.

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నీల్ కిచ్లూ జన్మించిన సంగతి తెలిసిందే.

పెళ్లి తర్వాత సత్యభామ, బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్, మురగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న సికిందర్ సినిమాలో కీలక పాత్రలో నటించింది.

ప్రస్తుతం తెలుగులో సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది.