28 March 2025

5 సినిమాలు చేస్తే ఒక్కటే బ్లాక్ బస్టర్.. ఇప్పుడు బంపర్ ఆఫర్.. ఎవరంటే

Rajitha Chanti

Pic credit - Instagram

సినీరంగంలో అదృష్టం ఎవరినీ ఎప్పుడు వరిస్తుందో చెప్పడం కష్టం. అందం, అభినయంతో మెప్పించినప్పటికీ కాసింత లక్ కూడా ఉండాల్సిందే.

తెలుగులో ఆమె నటించిన ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. దీంతో వరుస ఆఫర్స్ అందుకుంది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన మూవీస్ నిరాశపరిచాయి. 

దీంతో కొన్నాళ్లపాటు ఆమెకు అవకాశాలు రాలేదు. మెయిన్ హీరోయిన్‍గా కాకుండా స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్‏గా ఛాన్సులు అందుకుంది. 

కానీ ఇప్పుడు ఈ బ్యూటీకి బంపర్ ఆఫర్ వచ్చింది. ఆమె మరెవరో కాదు..  జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా. తెలుగులో క్రేజీ హీరోయిన్ ఆమె. 

ఇటీవలే అల్లరి నరేష్ సరసన ఆ ఒక్కటి అడగొద్దు సినిమాతో అలరించింది. ప్రస్తుతం కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనికి జోడిగా నటిస్తుంది. 

ఈ సినిమా విడుదల కాకముందే అమ్మడిని మరో లక్కీ ఛాన్స్ వరించిందట. విజయ్ దళపతి తనయుడు జసన్ సంజన్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. 

లైకా ప్రొక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో కథానాయికగా ఫరియా అబ్దుల్లాను ఎంపిక చేశారట. 

తమిళంలో తొలి సినిమా విడుదలకు ముందే ఇప్పుడు మరో యంగ్ హీరో సినిమా మరో క్రేజీ అవకాశం వరించడం ఫరియా అదృష్టమేనని అంటున్నారు.