టిల్లుగాని వీడియో సాంగ్..

TV9 Telugu

17 April 2024

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన తెలుగు రొమాంటిక్ క్రైమ్ కామెడీ సినిమా టిల్లు స్క్వేర్‌.

దీనికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

మురళీధర్ గౌడ్, మురళీ శర్మ, అనిష్ కురువిల్లా, ఉద్భవ్ రఘు, ప్రిన్స్ సెసిల్, ప్రణీత్ రెడ్డి కీలక పాత్రధారులు.

మార్చి 29న విడుదలైన ఈ మూవీ మొదటిరోజే బ్లక్ బస్టర్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లతో ఇప్పటికి దూసుకుపోతుంది.

మొదటిరోజు 23.7 కోట్లు భారీ వసూళ్లు చేసిన టిల్లు స్క్వేర్ చిత్రానికి ఇప్పటికే 100 కోట్లుపైగా గ్రాస్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం నుంచి ఓ వీడియో సాంగ్ యూట్యూబ్ వేదికగా విడుదల చేసారు మూవీ మేకర్స్. ఇది వ్యూస్ తో దూసుకుపోతుంది.

రామ్ మిర్యాల సంగీతం అందించిన ఈ చిత్రంలోని టిక్కెట్టే కొనకుండా... అనే వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్.

రామ్‌ మిరియాల పాడిన ఈ పాట యూత్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది.