లిల్లీ ప్రేమలో టిల్లు.. డోన్ట్ వర్రీ మచ్చా అంటున్న విశాల్..
TV9 Telugu
18 March 2024
యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్న సినిమా టిల్లు స్క్వేర్.
మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్. డీజే టిల్లుకి సీక్వెల్ గా వస్తుంది.
తాజాగా ఈ సినిమా నుంచి ఓ మై లిల్లీ పాట ప్రోమో విడుదల చేసారు దర్శక నిర్మాతలు. పూర్తి పాటను మార్చి 18న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
బాల నటిగా బ్రహ్మోత్సవం సహా చాలా తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అవంతిక. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు.
తాజాగా అవంతిక న్యూ ఫోటోషూట్ ఒకటి వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు బాగా ట్రెండింగ్ అవుతున్నాయిప్పుడు.
కోలీవుడ్ స్టార్ విశాల్ హీరోగా డైరెక్టర్ హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం రత్నం.
తాజాగా ఈ చిత్రం నుంచి డోన్ట్ వర్రీ మచ్చా అంటూ సాగే ఓ లిరికల్ సాంగ్ విడుదల చేసారు దీని దర్శక నిర్మాతలు.
ఈ పాటను స్వయంగా తెలుగు, తమిళంలోనూ దేవీనే ఈ పాట పాడారు. విశాల్ సినిమాకు మొదటిసారి సంగీతం అందిస్తున్నారు DSP.
ఇక్కడ క్లిక్ చెయ్యండి